2023-24 బడ్జెట్ లో ఈసారి కూడా రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా సీనియర్ నాయకుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ కి వెళ్లి నిద్రపోతున్నారా? లేక సుచేతనవస్థలో ఉన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను గలికొదిలేశారు, జగన్మోహన్ రెడ్డి 25 ఎంపీలు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని నమ్మబలకి రాష్ట్ర ప్రజలకు మోసం చేశారన్నారు. పోలవరం గురించి ప్రస్తావనే లేదు, జిల్లాకు సంబందించిన స్టీల్ ప్లాంట్ నిధులు కేటాయింపులేవు, కడప -బెంగళూరు రైల్వే లైన్ గత 4 సంవత్సరాలుగా నిధులు కేటాయింపులు లేవన్నారు. దీని సాధించడంలో జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి, ఎంపీలు విఫలం అయ్యారు అని తెలిపారు. మిగితా రాష్ట్రాలకు అన్ని రకాలుగా నిధులు కేటాయింపు జరిగాయి కాని ఏపీ వచ్చేసరికి ఏ ప్రత్యేక కేటాయింపులు లేవు అని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం విఫలం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టించుకోవడం లేదన్నారు.