పేదలకు పంపిణీ చేసే గృహ నిర్మాణాలపై ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి సూచించారు. బుధవారం వేంపల్లి పట్టణంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ బి. మల్లికార్జునరెడ్డి తో కలిసి హౌసింగ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గృహాలు నిర్మాణలపై సమన్వయంతో పని చేయాలని హౌసింగ్ మరియు సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. లబ్ధిదారులు త్వరితగతిన గృహ నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక చోరవ చూపాలని కోరారు. అలాగే లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో శ్రద్ధతో సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మండల వ్యాప్తంగా జగనన్న కాలనీలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారులతో ఏరోజుకు ఆరోజు గృహ నిర్మాణలపై చర్చించి, వెంటనే వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టే విధంగా తగు సలహాలు సూచనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్, రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.