కొత్త అల్లుడు ఇంటికి వస్తే రుచికరమైన వంటకాలను వడ్డించడం అందరికి తెలిసిందే. అయితే నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలంలో ఓ కుటుంబం వెరైటీగా అల్లుడికి విందుభోజనం ఏర్పాటు చేసింది. తొలిసారి ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 108 వంటకాలతో విందు భోజనం పెట్టారు. మండలంలో ఊసపల్లి వాసి, కండలేరు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ఉసా శివకుమార్, శ్రీదేవి దంపతులు తమ కూతురు శివాని, అల్లుడు ఉమ్మిడిశెట్టి శివకుమార్‌ల కోసం బుధవారం ఈ విందును ఏర్పాటు చేశారు. విందు ఆరగింపును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.