ఆధ్యాత్మిక తల్లిగా గుణదల మేరీమాత భక్తులతో నీరాజనాలు అందుకుంటోందని రీజనల్ సుపీరియర్ ఇం డియా రెవరెండ్ ఫాదర్ మర్నెని రవితానయ్య అన్నారు. గుణదల మేరీ మాత మహోత్సవాలకు ముందుగా నిర్వహించే నవదిన ప్రార్థనలు రెండో రోజు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రవితానయ్య విచ్చేశారు. భక్తులకు దైవ సందేశమిచ్చారు. భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని గుణదలమాత దేవాలయం నుంచి రెవరెండ్ ఫాదర్ రవి తానయ్య, విజయవాడ కథోలిక పీఠం మోన్సిగ్ఞోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల మాత పుణ్యక్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజ్, ఫాదర్ దామాల విజయ్‌కుమార్ అందజేశారు. కొండపై గుహలోని మరియమాత స్వరూపం వద్ద పూజాపీఠం గురువులు సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. కంకిపాడు, పెనమలూరు విచారణల నుంచి వచ్చిన భక్తులు కొవ్వొత్తులతో కొండ మధ్యలో ఉన్న గుహ వద్దకు చేరుకున్నారు.