కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆర్థిక సంవత్సరానికి బుధవారం బడ్జెట్ ప్రవేశపెటడం జరిగింది.గతంలో రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఉండేది. గత మూడేళ్లుగా సాధారణ బడ్జెట్‌తో పాటే దానిని ప్రకటిస్తున్నారు. అందులో వివరాలు ఏమీ వెల్లడించడం లేదు. అభివృద్ధికి ఏమి చేయాలనుకుంటున్నదీ మంత్రి చెబుతున్నారు. వారం రోజుల తరువాత విడుదల చేసే పింక్ బుక్‌లో ఏమి ఇచ్చారో చూసుకోవలసి వస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన ‘తూర్పు కోస్తా రైల్వేజోన్’ పరిస్థితి ఏమిటో ఈ బడ్జెట్‌లోను స్పష్టత ఇవ్వలేదు. గత నవంబరులో జోన్ కార్యాలయ నిర్మాణానికి రూ.107 కోట్లు మంజూరుచేశారు. అంతకుముందు విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్మిర్మాణానికి రూ.456 కోట్లు ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో ఈ ప్రాంతానికి ఏమి ఇచ్చిందీ అధికారులకు వెల్లడించలేదు. కొత్త రైళ్లు, కొత్త లైన్ల వివరాలు తెలియరాలేదు. దీనికోసం కొద్దిరోజులు ఆగాల్సిందే. గరీభ్‌రథ్, వారణాశి, బెంగుళూరు రైళ్లపై అధికారులు ఆశలు పెట్టుకున్నారు. ఏమవుతుందో వేచి చూడాల్సిందే.