ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండో ఛార్జ్ షీట్ లో ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ఈడీ నమోదు చేసింది. మరోసారి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును కూడా చేర్చింది. 428 పేజీలతో కూడిన రెండో ఛార్జ్ షీట్ ను ఈడీ విడుదల చేసింది. ఈ కేసులో కీలక నేతల పేర్లు తెరపైకి వస్తుండడంతో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోననే చర్చ మొదలైంది.