గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ పెటల్ ఎనామలీస్) స్కానింగ్ శుక్రవారం నుండి అందుబాటులోకి రావడంతో గర్భిణులకు ఇబ్బందులు తప్పాయి. గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య పరిస్థితి పై 18 నుంచి 23 వారాల్లో టిఫా స్కానింగ్ తప్పనిసరి ఉంటుంది. ఈ క్రమంలో ఈ సదుపాయం అందుబాటులో ఉండడంతో పేదలకు ఆర్థిక భారం కూడా తప్పింది.