ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసం వద్ద మోహరించిన సీఆర్ఫీఎఫ్ జవాన్ తన సర్వీస్ రైఫిల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని 53 ఏళ్ల ఏఎస్ఐ రాజ్ బీర్ కుమార్ గా గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.