ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక 31 డివిజన్లో విజయనగర కాలనీ లో రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమము నాల్గవ రోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమం 31 డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి మరియు తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గడపగడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అందరిని అడిగి తెలుసుకుంటున్నారు, ఏదైనా సమస్య ఉంటే తమ దిష్టికి తేవాలని సాధ్యమైనంత త్వరగా చేస్తామని వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేలనాటి మాధవరావు, బీసీ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కటారిశంకర్, తూము వెంకట్రావు, గొర్రెపాటి శ్రీనివాసులు, వైయస్సార్సీపి ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాజుల కృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు గుర్రం వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే ఆదేన్న, బొమ్మినేని మురళి, సూపర్ బజార్ డైరెక్టర్ వల్లెపు మురళి, సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి కరుణాకర్, కమిషనర్ ఎం. వెంకటేశ్వరరావు, ఎం. మాల్యాద్రి, మున్సిపల్ ఎ. సి. పి వెంకటేశ్వర రావు, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాబ్జి, హౌసింగ్ ఏ. ఈ మస్తాన్, మెప్మ సీ. ఈ. ఓ. సుబ్బారావు, పున్నయ్య, కార్పొరేటర్స్ యనమల నాగరాజు, ఈదరా చిన్నారి, అంగిరేకుల గురవయ్య, తోటపల్లి సోమశేఖర, మిరవాలి, వైఎస్ఆర్సిపి మహిళ నాయకులు సువర్ణ, మాతా శిశు వైద్య శాల డైరెక్టర్ సాదం విజయలక్ష్మి, బైరెడ్డి అరుణ, బడుగు ఇందిర, కోటేశ్వర రావు, తమ్మినేని మాధవి, రాజేశ్వరీ, సాహిత్య అకాడమీ డైరెక్టర్ జ్యోతి, తుగురు మాధవి, తూము పద్మ, మరియమ్మ, చిట్టి బోయిన రమణమ్మ, కృష్ణ వేణి నాగేశ్వర రావు, మాధవి, దాసరి శ్రీదేవి, కోటేశ్వరమ్మ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.