శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని బిసి వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ హాస్టల్ లో త్రాగు నీటి సమస్యను ప్రిన్సిపాల్ , స్టాఫ్, విద్యార్థులు సాహితీ గగన్ మహల్ సంస్థ అధ్యక్షులు, న్యాయవాది జె. ప్రతాప రెడ్డి దృష్టికి సోమవారం తీసుకొనిపోవడం జరిగింది. ఈ విషయం పై ప్రతాపరెడ్డి యం వి రావు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ ముంబయి కి త్రాగు నీటి సమ్యసను వివరించటం జరిగినదని ఆయన 500 లీటర్లల సామర్థ్యం కలిగిన ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించారని ఈ సందర్బంగా ఈ ప్లాంట్ ను కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ క్రింద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సెంట్ బ్యాంక్ హోమ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ నిధులు మంజూరు చేసిందని ప్రతాప్ రెడ్డి తెలిపారు.