త్వరలో జరగనున్న పశ్చిమ రాయల సీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్న భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని గుంతకల్లు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆర్. జితేంద్ర గౌడ్ నాయకులకు కార్య కర్తలకు పిలుపునిచ్చారు. సోమ వారం గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం నిర్వహించారు. అనంతరం జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జితేంద్రగౌడ్ మాట్లాడు తూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు టిడిపి పార్టీకి ఎంతో కీలకమన్నారు. కావున తమ పార్టీ అభ్యర్థిని గెలిపిం చుకునేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కృషి చేయాల న్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు పవన్ కుమార్ గౌడ్, ప్రతాప్ నాయుడు, మస్తాన్ యాదవ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.