వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడా కూడా జగన్ మోహన్ రెడ్డి ని ఒక మాట అనలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నచ్చితే సెక్యూరిటీ ఇవ్వడం ఏంటి, నచ్చకపోతే తీసేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఎవరో రిపబ్లిక్ పార్టీ అతను శ్రీధర్‌రెడ్డిని కొట్టుకుంటూ తీసుకొని వెళ్తామని బెదిరింపులు రావడం దురదుష్టకరమన్నారు. కొందరి వలన శ్రీధర్ రెడ్డి తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదని అన్నారు. శ్రీధర్ రెడ్డి మనోవేదన చెప్పారని... ఆయనకు ప్రజా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నెల్లూరు మేయర్, కార్పొరేటర్లు కూడా రాజీనామా చేశారన్నారు. కోటం రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అనుకుంటే పార్టీ నుంచి బహిష్కించడం తప్ప ఏమీ చేయలేరని వ్యాఖ్యలు చేవారు.