డ్వాక్రా సంఘాలను సీఎం జగన్ నిర్వీర్యం చేశారని టీడీపీ నేత నారా లోకేష్ దుయ్యబట్టారు. చిత్తూరు లో మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికసాయం చేశామని తెలిపారు. మద్య నిషేధం చేస్తామని మహిళలను జగన్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి పాలనలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లేని దిశ చట్టం పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చెల్లికి, తల్లికి న్యాయం చేయలేనోడు సామాన్యులకు ఏం చేస్తాడు? అని లోకేష్ ప్రశ్నించారు. ఏపీలో నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం రాగానే పన్నులు తగ్గించి.. ధరలు అందుబాటులోకి తెస్తామని లోకేష్ ప్రకటించారు.