ఏపీ రాజధాని అమరావతి కేసు ను మెన్షన్ లిస్టు లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాసిన లేఖ పై ఫలితం కనిపించలేదు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు మెన్సన్ జాబితాలో ఈ కేసు ప్రస్తావన కనిపించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం ఏంటనే అంశంపై న్యాయవాదుల్లో చర్చ జరుగుతోంది.
ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాకలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సత్వరమే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. ఇవాల్టి మెన్షన్ జాబితాలో దీన్ని చేర్చాలని అభ్యర్థించింది. ఆదివారం సాయంత్రం వరకూ సుప్రీం కోర్టులో సోమవారం మెన్షన్ జాబితాలో చేర్చాల్సిన అంశాలలో ఈ కేసు లేదని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ తర్వాత ఏమైనా మెన్షన్ జాబితాలోకి వస్తుందేమోనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.