కడప జిల్లా, మదన పల్లెలో ఎకరాలకు ఎకరాలు కబ్జాలకు పాల్పడుతుంటే బడాబాబులను వదిలేసి పేదలపై రెవెన్యూ అధికారులు ప్రతాపం చూపడం దారుణమని బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అథ్యక్షుడు బోడెం రాజశేఖర్ పేర్కొన్నారు. మదన పల్లెకు చెందిన బీసీ మహిళ సరోజమ్మ చీరు వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగిస్తోందని, ఆమెకు 2019లో ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం పోన్నూటి పాళెం పంచాయతీ రెవెన్యూ సర్వేనెంబరు 412లో ఫ్లాట్ నెంబరు 3ను కేటాయించి పొజిషన సర్టిపికేట్‌ను మంజూరు చేయడంతో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టిందన్నారు. కాగా ఎటువంటి నోటీసులు, మందస్తు సమాచారం లేకుం డానే రెవెన్యూ అధికారులు శనివారం తెల్లవారుజామున ఎక్స్‌కవేటర్‌తో ఆమె ఇంటి పునాదులు తొలగించడం దారుణమన్నారు. ఇంటి నిర్మాణం కోసం గత ఏడాది జనవరి 3వతేదీ, మార్చి 11వతేదీ, మే 22వ తదీన మూడు దపాలుగా ఆమె ఖాతాలో ప్రభు త్వం బిల్లులను జమచేసిందన్నారు. ఈ నేపథ్యంలో నిరుపేదరాలైన ఆమె ఎంతో కష్టప డి అప్పులు చేసి పునాదులు వేసుకొంటే రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా తొలగించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయను న్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు హరినాథ్, వేణుగోపాల్, నాగినేని గోవిందు, రామలింగ, రామకృష్ణ, గురుమూర్తి, వెంకటేశ్వరయాదం్, బండిరామచంద్ర, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు.