అంగన్వాడీ కేంద్రాలను ముఖ్యమంత్రి, స్త్రీశిశు సంక్షేమమంత్రి గాలికొదిలేశారని టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మంగళగిరిలో ధ్వజమెత్తారు. ప్రజాధనం దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ... అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై, సిబ్బంది సమస్యల పరిష్కారంపై లేదని ఆమె మండిపడ్డారు. అరకొర జీతంతో పని చేస్తున్న సిబ్బందిపై పనిభారం పెంచి, మెనూ అమలులో టార్గెట్లు విధిస్తూ అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు.