తమ పార్టీతో బోరుగడ్డ అనిల్‌కు సంబంధంలేదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బోరుగడ్డ అనిల్ కుమార్‌కు.. తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఆ పార్టీ రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని.. ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు అంజయ్య వివరించారు. తమ పార్టీకి సంబంధం లేదని చెప్పారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న అనిల్ కుమార్.. ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపాలని అంజయ్య డిమాండ్ చేశారు. అనిల్‌కు అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సిద్ధాంతాలు తెలుసా.. అంటూ అంజయ్య ప్రశ్నించారు. ఒక పార్టీ పేరు చెప్పి.. మరో పార్టీకి కొమ్ము కాయడం ఏంటని ప్రశ్నించారు. గుంటూరులోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని.. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసిన విషయం తెలిసిందే.
ఆఫీస్ వాచ్‌మన్ నారాయణతో కలిసి అనిల్ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ముసుగు ధరించిన ఆరుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి, తగులబెట్టారని వాచ్‌మన్ ఫిర్యాదు చేసినట్లు సీఐ రామానాయక్ చెప్పారు. సీసీ పుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరగా.. అది పని చేయడం లేదని చెబుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అనిల్ కుమార్ స్పందించారు. 'నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై నేను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే శ్రీధర్‌రెడ్డి అనుచరులు, గుంటూరుకు చెందిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, అతని అనుచరులు నా కార్యాలయాన్ని దహనం చేశారు. అడ్డొచ్చిన మా వాచ్‌మన్‌పై పెట్రోల్ పోసి చంపేందుకు యత్నించగా అతను పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు' బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.