ఉసిరికాయతో చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అయితే ఉసిరికాయతో దగ్గును నయం చేయడమే కాకుండా హైపర్యాసిడిటీ లక్షణాలను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. దగ్గు నుంచి ఉపశమనం కోసం ఉసిరికాయ రసాన్ని తేనెలో కలిపి రోజుకు 2 సార్లు తాగాలి. పెద్ద ఉసిరికాయను బాగా కడిగి, దాని నుండి గింజలను వేరు చేసి, కొంచెం కారం, రుచికి ఉప్పు వేసి బాగా కలపాలి. తులసి ఆకులను బాగా కడిగి పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఉసిరికాయలో మిక్స్ చేసి తినాలి. కఫంతో బాధపడేవారు ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.