ఫిబ్రవరి 22న విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు సమన్లు జారీ చేసిందని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం వెల్లడించారు. తన కుమార్తెకు సీబీఐ నోటీసులు జారీ చేసిందన్నారు.ఈడీ, సిబిఐ ప్రతిపక్షాల పైనే దర్యాప్తులు చేపడతాయి తప్ప పాలక వర్గాలను ఏమీ అనవని విమర్శించారు.రోజూ నోటీసులు అందడం మామూలేనని, నిన్న తన కుమార్తెకు సీబీఐ నుంచి నోటీసు వచ్చిందని, ఫీజు చెల్లింపు, పరీక్షలో ఉత్తీర్ణతపై విచారణకు నోటీసులు వచ్చాయన్నారు. అధికార వర్గాల నేతలు కోట్లకు పడగలెత్తుతున్నా.. ఈడీ, సీబీఐ అడగడం లేదని.. ప్రతిపక్షాలపైనే విచారణ చేయాలి అని వ్యాఖ్యానించారు.