ఆర్థిక సంక్షోభం భయంతో టెక్ దిగ్గజాలన్నీ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. తాజాగా ఈ లిస్టులో ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ కూడా చేరింది. తమ సంస్థలోని 7 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సబ్ స్క్రైబర్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సంస్థ 3.8 మిలియన్ సబ్ స్క్రైబర్లు తగ్గినట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa