శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని బిసి వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ హాస్టల్ నందు గురువారం ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా హాస్టల్ లో నెల కొన్న త్రాగు నీటి సమస్యను సాహితీ గగన్ మహల్ సంస్థ అధ్యక్షులు, న్యాయవాది జె. ప్రతాప రెడ్డి దృష్టికి తీసుకొనిపోవడం జరిగింది. ఈ విషయం పై ప్రతాపరెడ్డి యం వి రావు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ ముంబయి కి త్రాగు నీటి సమ్యసను వివరించటం జరిగినది, ఆయన 500 లీటర్లల సామర్థ్యం కలిగిన ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించారని, హాస్టల్ లో ఆర్ ఓ వాటర్ ప్లాంటు నిర్మాణ పనులు పూర్తి చేయటం జరిగిందని తెలిపారు. ఈ ప్లాంట్ ను కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ క్రింద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సెంట్ బ్యాంక్ హోమ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్య క్రమంలో సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ ప్రెసిడెంట్, నాయ్యవాది జె ప్రతాప రెడ్డి , హాస్టల్ వార్డెన్ గంగాధర్ , హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa