ఏపీలోని విశాఖపట్నంలో గంజాయి మూటలు ఎగిరిపడ్డాయి. అల్లూరి జిల్లా అరకు ఘాట్ రోడ్డులో ఓ కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన కారు పక్కనున్న అడవి ప్రాంతంవైపు దూసుకెళ్లింది. దీంతో కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి మూటలు బయటపడ్డాయి. భయపడిపోయిన స్మగ్లర్లు ఆరు గంజాయి బస్తాలను అక్కడే వదిలేసి పారిపోయారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa