ఉరవకొండ మండలంలోని పెద్ద మూస్టురులో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, ఎడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీరాంజినేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వైస్సార్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను విశ్వేశ్వరరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa