మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఫిబ్రవరి 13వ తారీఖున విజయవాడ కేంద్రంలో జాతీయ రహదారి దిగ్బంధం చేసి తీరుతాం అని ఎమ్మార్పీఎస్ కడప జిల్లా కో-కన్వీనర్లు రామోజీ మాదిగ, రామకృష్ణ మాదిగ లు పేర్కొన్నారు. శనివారం బి. కోడూరు మండలంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ. వర్గీకరణ చేస్తారో లేక మోసగాళ్లుగా చరిత్ర ఎక్కుతారో బిజెపి తెల్చుకోవాలి. మాదిగలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.
జాతీయ రహదారి దిగ్బంధనాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయాలకు, కుల, మతాలకతీతంగా మాదిగ, మాదిగ ఉప కులాలు, వర్గీకరణ సమర్థించే ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్దతపై న్యాయం చేయకుండా అనుకకూలమంటునే బిజెపి చేస్తున్న జాప్యాన్ని, మోసాన్ని ఎండగట్టేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర పాలకుల కళ్ళు తెరిసేలా ఉద్యమిద్దాం. రండి కదలి రండి. అంటూ వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బద్వేల్ ఇంచార్జ్ యంయస్ఎఫ్ నాయకులు అనిల్ మాదిగ, బాలకేషయ్య, జాన్సన్, రమేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.