ప్రస్తుత జీవన శైలితో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతోంది. సరైన సమయానికి ఫుడ్ తీసుకోకపోవడం, బయటి ఫుడ్స్ తినడం వంటి వాటి వల్ల ఈ సమస్య ఎదురవుతోంది. అయితే, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకోవాలని పేర్కొంటున్నారు.