రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా, పల్లిపేట పంచాయతీలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కలిగించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబునాయుడును మళ్లీ సీఎంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో నేతలు భైరి భాస్కరరావు, కిల్లి వేణు, మిరియబిల్లి వెంకట అప్పల నాయుడు, రోణంకి కృష్ణంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.