జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆపార్టీ తూర్పు గోదావరి జిల్లా, పీఏసీ సభ్యుడు,సర్పవరం రూరల్ ఇన్చార్జి పంతం నానాజీ కోరారు. పెనుమర్తిలో గ్రామకమిటీ అధ్యక్షుడు పెంకే కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలు, రైతు సమస్యల పరిష్కారానికి పవన్ విశేష కృషి చేస్తున్నారన్నారు. సంస్థాగతంగా పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్టీ పిలుపు మేరకు ఈనెల 10 నుంచి క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక సమస్యలపై చర్చించి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు కరెడ్ల గోవిందు, జిల్లా సహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు, రెడ్డిపల్లి కిషోర్, గేదెల చిన్నారావు, జి.రామకృష్ణ, అప్పారావు, భాను, వెంకటరమణ పాల్గొన్నారు.