కేంద్రంలోని బీజేపీ పాలన దేశ విచ్ఛిన్నానికి దారితీసేలా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. విజయవాడ ఎంబీవీకెలో త్రిపుర సంఘీభావ సభలో ఆయన మాట్లాడుతూ..కేంద్రం ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని మండిపడ్డారు. త్రిపురలో గెలవడానికి అనేక అప్రజాస్వామిక ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.