నందిగామ పట్టణం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ వర్కర్ యూనియన్ సి. ఐ. టి. యు నందిగామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులకు పెద్ద ఎత్తున నిరసన చూపెట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కే. గోపాల్ మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల ఏపీ ఎఫ్ ఆర్ ఎస్ విధానం ద్వారా జీతాలకు ఉద్యోగులకు రాబోతున్న ప్రమాదాన్ని తిప్పి కొట్టాలి, అలాగే 2022 జులై సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుపట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టి హామీలు అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పోరాటానికి సంసిద్ధం కావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నరేష్ , కార్యదర్శి దాసవరపు సైదా , పుట్ట మాణిక్యం , నాగరాజు , గరిపాటి ప్రసాద్, బేబీ , రుతుమ , పిచ్చియ్య. కార్మికులు పాల్గొన్నారు.