తానే గెలవలేడు.. పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా,,,నారా లోకేష్ పై వైసీపీ యువజన విభాగం చీఫ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు. నారా లోకేష్ ప్రవర్తన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కాదు కదా.. రెండు మూడు సీట్లు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్లకు సంబంధించిన మీటింగ్‌లలో మహిళలు జై జగన్, కొంతమంది నిన్ను నమ్మం బాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఏకంగా టీడీపీ కార్యకర్త మాట్లాడుతూ.. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి రాజకీయం చేయడం కాదు.. వచ్చి ఆంధ్రరాష్ట్రంలో ఇల్లు కట్టుకొని రాజకీయం చేయండి.. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు జనం అని చంద్రబాబును ఉద్దేశించి వాళ్ల మీటింగ్‌లలోనే చెప్పడం చూశామని బైరెడ్డి సిదార్థ్ రెడ్డి గుర్తు చేశారు.
'చనిపోయిన వైఎస్‌ఆర్ గురించి కూడా నారా లోకేష్, చంద్రబాబు వాళ్ల మీటింగ్‌లలో ప్రస్తావిస్తున్నారు. 24 కమిషన్లు వేసినా, విచారణలు వేసినా వైఎస్‌ఆర్ కూడా మా అవినీతిని నిరూపించలేకపోయారని నారా లోకేష్ మాట్లాడటం సిగ్గుచేటు. వైఎస్‌ఆర్ బతికి ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతిపరుడు, దొంగ అని తెలిసినా, విచారణ రెండు అడుగులు ముందుకుపడితే చంద్రబాబు అరెస్టు అవుతారని తెలిసినా.. ఆరోజున చంద్రబాబు వెళ్లి వైఎస్‌ఆర్ కాళ్లు పట్టుకుంటే జాలిచూపించి, అల్పుడిపై వజ్రాయుధాలు వేయడం ఎందుకని వదిలేసిన సంగతి అందరికీ తెలుసు' అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు.
'నారా లోకేష్‌ను ఒక్కటే అడుగుతున్నా.. బాలకృష్ణ విషయంలో వైఎస్‌ఆర్ చేసిన మేలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిది. వైఎస్‌ఆర్ చనిపోయిన తరువాత వీరులం, శూరులం అని చెబుతున్నారే.. ఆరోజున సోనియాగాంధీ, కాంగ్రెస్‌లోని పెద్దల కాళ్లు పట్టుకొని జగన్ ఏ తప్పు చేయకపోయినా కేవలం సాక్షిలోని పెట్టుబడులు చూపించి కేసులు వేయించిన మాట వాస్తవం కాదా? మీరెన్ని కుట్రలు చేసినా ప్రజా కోర్టులో జగన్ గెలిచిన విషయం మరిచిపోయారా..? ఉప ఎన్నికల్లో 15 స్థానాల్లో, 2014 ఎన్నికల్లో 67 సీట్లు, 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి ప్రజల న్యాయస్థానంలో గెలిచిన వ్యక్తి జగన్' అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వివరించారు.
'చంద్రబాబు ఏరోజూ నీతిపరుడు కాదు. చంద్రబాబు అవినీతిని నిరూపించాలని చూసినా ఆయన వెంటనే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. రాజధాని భూముల విషయంలో విచారణపై స్టే తెచ్చారు. అచ్చెన్నాయుడు కుంభకోణంపై స్టే తెచ్చారు. ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించిన సంగం డెయిరీ విచారణలో స్టే తెచ్చారు. చంద్రబాబు అక్రమాస్తులపై నందమూరి లక్ష్మీపార్వతి పిటీషన్ వేస్తే.. దానిపై స్టే తెచ్చారు. విదేశీ పెట్టుబడులపై విచారణ చేద్దామంటే.. దాన్ని జరగనివ్వకుండా చేశారు' అని నారా లోకేష్ ఆరోపించారు.