జీఎస్టీలో కొన్ని సేవలు చేర్చడంతో కొన్ని వస్తువుల ధరలు పెరగ్గ...మరికొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 49వ జీఎస్టీ మండలి జరిగింది. ఇందులో జీఎస్టీ అప్పీలెట్ ట్రైబ్యునల్ ఏర్పాటు నుంచి రాష్ట్రాలకు పెండింగ్ జీఎస్టీ పరిహారాల చెల్లింపుల వరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ నాటికి రాష్ట్రాలకు పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ పరిహారం రూ.16,982 కోట్లు క్లియర్ చేస్తామని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వాటితో పాటు కొన్ని వస్తువులపై జీఎస్టీ ట్యాక్స్ తగ్గింపు, కొన్నింటిపై పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అనే విషయాలను పరిశీలిద్దాం.
ట్యాక్స్ చెల్లింపుల విషయంలో పెండింగ్‌లో కేసుల పరిష్కారం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అప్పీలెట్ ట్రైబ్యునల్ ఏర్పాటు కోసం ఈ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో ఆమోదం తెలిపారు. పాన్ మసాలా కంపెనీలు పన్ను ఎగవేత, గుట్కా వంటి వాటిపై మంత్రివర్గ ఉప సంఘాలు సమర్పించిన నివేదికలను ఆమోదించారు. వాటిని సభ్యుల అభిప్రాయాల కోసం పంపిస్తామని, తర్వాత ఛైర్మన్ ఆమోద ముద్ర వేస్తారని తెలిపారు. మరోవైపు.. పలు ట్యాక్స్ కట్స్, కొత్త ఛార్జీల అమలుతో వినియోగదారులు, ఇండస్ట్రీ స్టాక్‌హోల్డ్స్‌పై నేరుగా ప్రభావం చూపనుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ ట్యాక్స్ మార్పులపై ప్రకటనలతో పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి.
జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత ధరలు తగ్గేవి
లిక్విడ్ బెల్లం
పెన్సిల్ షార్ప్నర్స్
డాడా లాగెర్స్
కోల్ రిజెక్ట్స్
ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎన్‌టీఏ నిర్వహించేవి) నిర్వహించే ఎంట్రాన్స్ ఎగ్జామ్ ఫీ
మిల్లెట్స్‌పై ట్యాక్స్ రాయితీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జీఎస్టీ కౌన్సిల్ తర్వాత ధరలు పెరిగేవి..
కోర్టు సర్వీసులు
పాన్ మసాలా
గుట్కా
నమిలే పొగాకు
పైన పేర్కొన్న వస్తువులకు అదనంగా జీఎస్టీ కౌన్సిల్ త్వరలోనే ఆన్‌లైన్ గేమింగ్స్, హార్స్ రేసులు, క్యాసినో వంటి వాటిపై పన్నులపై నిర్ణయంతీసుకోనుంది. ప్రస్తుతం లిక్విడ్ బెల్లం జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ బెల్లం ప్యాక్ చేసి విక్రయిస్తే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. అయితే, విడిగా విక్రయిస్తే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. పెన్సిల్, షార్ప్‌నర్‌పై కూడా 18 శాతం నుంచి 12 శాతానికి మార్చారు. 2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన జీఎస్టీఆర్-9 దాఖలు విషయంలో ఆలస్య రుసుం హేతుబద్ధీకరించారు. రూ.5 కోట్ల వరకు ఆలస్య ఫీజు రోజుకు రూ.50గా నిర్ణయించారు. మరోవైపు.. రూ.5- 20 కోట్ల టర్నోవర్ ఉంటే రోజుకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.