ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతా మీరే చేశారు... ఆనంద్ మహీంద్రపై విరాట్ ఫ్యాన్స్ అసహనం

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 12:09 AM

అంతా మీరే చేశారు అంటూ ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్ మహీంద్రపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తంచేశారు. ఇదిలావుంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 20 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్ టోడ్ ముర్ఫీ వేసిన వేసిన బంతని ఆడే క్రమంలో కోహ్లీ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంత వరకు ఓకే అయినప్పటికీ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. క్లోహీ ఔట్ అయ్యేందుకు ఆనంద్ మహీంద్రే కారణం అన్నట్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆనంద్ మహీంద్రపై ట్విట్టర్ యూజర్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఏం జరిగింది?


ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. ఎప్పటికప్పుడు ఆశ్చర్యకర వీడియోలను పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఔట్ అయిన విషయంపై ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. తాను టీవీ ఆన్ చేయగానే కోహ్లీ ఔట్ అయ్యాడని, ఆ తర్వాత టీవి కట్టేసినట్లు రాసుకొచ్చారు. 'నేను మ్యాచ్ చూసేందుకు టీవీ ఆన్ చేశాను. ఆ వెంటనే కోహ్లీ అవుట్ అయి వెళ్తున్న సంఘటన కనిపించింది. నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నానని మాట ఇస్తున్నా. ఇకపై మిగిలన మ్యాచ్ చూడను..' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.


ఈ క్రమంలో బాలా అనే ఓ ట్విట్టర్ యూజర్ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై విరాట్ కోహ్లీ ఔట్ అయ్యేందుకు మీరే కారణం అంటూ రాసుకొచ్చాడు. దానికి ఆనంద్ మహీంద్రా షాకింగ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. బాలాతో పాటు చాలా మంది నెటిజన్లు మహీంద్రా ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు. కొందరు ఆనంద్ మహీంద్రా టీవీ కేబుల్ వైర్ కట్ చేస్తామని సైతం రాశారు. 'శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. తాత్కాలికంగా మీ కేబుల్ కనెక్షన్ కట్ చేసేందుకు మీ ఇంటికి వస్తున్నాను సర్.'అని మరొకరు రాసుకొచ్చారు. అలాగే.. సచిన్ కానీ, ఇప్పుడు కోహ్లీ గానీ మీరు ఎవరినైనా నిందిస్తారు అంటూ మరో యూజర్ ఆనంద్ మహీంద్రాకు మద్దతుగా నిలిచారు.


ఆస్ట్రేలియాతో దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో రవీంద్ర జెడా అద్భుత ప్రతిభ కనబరిచాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో మూడు రోజుల్లోనే ఆరు వికెట్ల తేడాతో ఆసిస్‌పై గెలిచింది టీమిండియా. బోర్డర్- గావస్కర్ ట్రోఫీని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడెజాకు 7 వికెట్లు లభించాయి. కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మగిలిన మూడు వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. మూడో టెస్ట్ మ్యాచ్ మార్చి 1 నుంచి ఇండోర్‌లోని హోల్కార్ స్టేడియంలో ప్రారంభం కానుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com