కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్‌కాస్టర్ల మధ్య ముదిరిన వివాదంతో ప్రముఖ ఛానళ్లు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇదిలావుంటే ప్రస్తుతం ప్రతి ఇంటిలో టెలివిజన్ అనేది తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు కుటుంబంలో ఒకరిలా వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో టీవీ ఛానల్‌పై ఇష్టం ఉంటుంది. అందులో వచ్చే కార్యక్రామాలు, సీరియళ్లను క్రమం తప్పకుండా చూస్తారు. టీవీ ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్ అనే చెప్పాలి. కేబుల్ ఆపరేటర్లతో వివాదంతో ప్రముఖ టాప్ టీవీ ఛానల్స్ ఆగిపోనున్నాయి. సుమారు 40 మిలియన్ల ఇళ్లకు ఆయా టీవీ బ్రాడ్‌కాస్టర్స్ సిగ్నల్స్ నిలిపివేయనున్నారు. ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఆగిపోనున్న నేపథ్యంలో టీవీ ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.
బ్రాడ్‌కాస్టర్స్, కేబుల్ ఆపరేటర్ల మధ్య సయోధ్య కుదరని నేపథ్యంలో లక్షల మంది టీవీ ప్రేక్షకులకు పాపుల్ టెలివిజన్ ఛానల్స్ నిలిచిపోనున్నాయి. అందులో జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా, డిస్నీ స్టార్‌లు ఉన్నాయి. కేబుల్ ఆపరేటర్లకు తమ సిగ్నల్స్‌ని నిలిపివేయబోతున్నట్లు ఆయా ఛానళ్లు ప్రకటించాయి. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 40 మిలియన్ల హౌస్‌హోల్డ్‌ర్స్‌పై ఈ ప్రభావం పడనుంది.
ప్రముఖ బ్రాడ్‌కాస్టర్స్ తమ ఛానల్స్ రేట్లను పెంచాయి. అయితే, పెంచిన రేట్లను ఇచ్చేందుకు కేబుల్ ఆపరేటర్లుఅంగీకరించకపోవడంతో వివాదం రాజుకుంది. కొత్త టారిఫ్ ఆర్డర్ 3.o లో భాగంగా బ్రాడ్‌కాస్టర్స్ ఛానల్స్ ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచాయి. గతంలోనే ఒక్కో ఛానల్‌కి రూ.12 ఉండగా.. దానిని రూ.19 వరకు పెంచేశాయి. ఈ కొత్త రేట్లు 2023, ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి తీసుకొచ్చాయి. అయితే, ధరల పెంపుతో తమ కస్టమర్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని కేబుల్ ఆపరేటర్లు, మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛానళ్ల ధరలు పెంచటం సరికాదని పేర్కొంటున్నారు. మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు అంటే డైరెక్ట్ బ్రాడ్‌కాస్ట్ శాటిలైట్ టెలివిజన్ సిస్టమ్స్‌ని స్థానిక కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఇంటింటికి సిగ్నల్స్ అందిస్తుంటారు. కేబుల్ ఆపరేటర్లతో నెట్‌వర్క్ కెపాసిటీ ఫీని పంచుకుంటారు. ఎన్‌సీఎఫ్ అనగా.. టీవీ ఛానళ్లకు కస్టమర్లు చెల్లించే ఛార్జీలు.
మరోవైపు.. ఎన్‌టీఓ 3.0 ఒప్పందంప 90 శాతం డీటీహెచ్ ఆపరేటర్లు, మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు సంతకాలు చేసినట్లు ఇండియన్ బ్రాడ్‌కాస్ట్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) పేర్కొంటోంది. మిగిలిన వారు తమ నిర్ణయాన్ని వెల్లడించలేదన్నారు. బ్రాడ్‌కాస్టర్స్ తమతో సహకరించి నిరంతరాయంగా ఛానల్స్ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఐబీడీఎఫ్ సెక్రెటరీ జనరల్ సిద్ధార్థ్ జైన్. అయితే, పైన పేర్కొన్న ఛానల్స్ బ్రాడ్‌కాస్టర్లు మాత్రం 25-30 శాతం ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, అందుకు ఎంఓఎస్ ఇంత వరకు అంగీకరించలేదు. ఈ నిర్ణయం తీసుకుంటే బ్రాడ్‌కాస్టర్లపైనే ప్రభావం చూపుతుందన్నారు. యాడ్ రెవన్యూపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఇప్పటికే యాడ్ రెవెన్యూ తగ్గిపోతోందని గుర్తు చేశారు.