మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కి చేరుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 155/6 పరుగులు చేసింది. స్మృతి మందన 87 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 54/2 పరుగులు చేసి వర్షం అంతరాయం కలిగించింది. డీ/ఎల్ పద్ధతిలో టీమ్ ఇండియా గెలిచినట్లు ప్రకటించారు.