అనంతపురం జిల్లా, గుత్తి పట్టణ శివారులో జాతీయ రహదారిపై వేర్వేరు చోట్ల దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. వాహనదారులను ఆదివారం అర్ధరాత్రి మరణాయుధాలతో బెదిరించి రూ.75 వేలు దోచుకున్నారు. బాట సుంకలమ్మ దేవస్థానం సమీపంలో ఓ పెట్రోలు బంకు వద్ద డోనకు చెందిన దూదేకుల దస్తగిరి తన లారీని నిలిపాడు. గుర్తు తెలియని ముగ్గురు దొంగలు ద్విచక్రవాహనంపై వచ్చి మరణాయుధాలతో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.40 వేలు దోచుకున్నారు. కొత్తపేట సమీపంలో బొలేరో వాహనం నిలిపిన డ్రైవర్‌ను బెదిరించి రూ.15 వేలు, పత్తికొండ రహదారిలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఐచర్ వాహనం నిలపిన డ్రైవర్‌ను బెదిరించి రూ.20 వేలను దోచుకున్నారు. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై సంచరిస్తూ దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలకోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa