వైసీపీ పాలనలో రాజకీయ దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లో రౌడీమూకలు రెచ్చిపోయి సృష్టించిన విధ్వంసం.. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని అన్నారు. పోలీసుల కళ్లెదుటే టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారని, వాహనాలను దహనం చేశారని, దీనికి సీఎం జగన, డీజీపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే జగనరెడ్డి ఇలాంటి దుశ్చలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.