గన్నవరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులు, హింసాత్మక ఘటనలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, డీజీపీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...... టీడీపీ నేతలు దొంతు చిన్నా, పట్టాభి భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఉందని, వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని మండిపడ్డారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై వైసీపీ రౌడీలు దాడి చేసి ధ్వంసం చేశారని, అక్కడ ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారన్నారు. దొంతు చిన్నాకు చెందిన పలు వాహనాలకు నిప్పుపెట్టారని, పట్టాభిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారా?.. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా?... నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు చంద్రబాబు తెలిపారు.