పేను బంక అరటి ఉత్పత్తిని తగ్గిస్తుంది. పేనుబంక అరటిలో వచ్చే బంచీ టాప్ వైరస్ కి వాహకంగా ఉంటుంది. ఇవి రసాన్ని పీల్చి మొక్కల నాశనం చేస్తాయి. అయితే దీనిని ముందుగానే నివారించవచ్చు. 10-15 రోజుల వ్యవధిలో మోనోక్రోటోఫాస్ (0.05శాతం) లేదా మలాథియాన్ (0.1 శాతం) పిచికారీ చేయడం ద్వారా పేనుబంకను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది మళ్లీ రాకుండా ఉండేందుకు హెక్టారుకు ఒక కిలో ఫోరేట్.. మొక్కలపై కాకుండా నేలలో వేసుకోవాలి.