ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడు గంటలు కష్టపడి ...ఆచేతిని అతికించేశారు

international |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 08:43 PM

వైద్యులు తలుచుకొంటే చెయ్యనిది ఏమీ లేదు అని బెంగుళూరు వైద్యులు అద్భుతం చేసిచూపించారు. తెగిపోయిన చేతిని తిరిగి అతికించారు. బెంగళూరులో జరిగిందీ ఘటన. నగరానికి చెందిన ఓ వ్యక్తి (55) ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కంపెనీకి ఇటీవల కొత్తగా వచ్చిన ఓ యంత్రాన్ని పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు చెయ్యి అందులో పడి మణికట్టు వరకు తెగిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఫ్యాక్టరీ సిబ్బంది తెగిపడిన చేయితో పాటు బాధితుడిని వెంటనే నగరంలోని బన్నేరుఘట్‌లో ఉన్న ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఏడు గంటలపాటు ఆపరేషన్ చేసి తెగిపడిన చేతిని విజయవంతంగా అతికించినట్టు ఆసుపత్రి సర్జన్ సత్యవంశీకృష్ణ తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com