ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కానీ పిల్లలు కావాలని వుంది...మనస్సులో మాట చెప్పిన రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 08:43 PM

తనకు పిల్లలు కావాలని ఉందని తన మనస్సులోని మాటను ఓ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బయట పెట్టారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదన్న ఆయన.. పిల్లలు కావాలని మాత్రం ఉందని బదులిచ్చారు. తన అమ్మమ్మ పావ్‌లామాయినోకు తన సోదరి ప్రియాంక గాంధీ అంటే ఎంతో ఇష్టమని, ప్రాణప్రదంగా చూసుకుందని ఆయన అన్నారు.


ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. ఎందుకన్న విషయం తెలియదని, కాకపోతే ఈ విషయం తనకే విచిత్రంగా ఉంటుందని అన్నారు. చాలా పనులు చేయాల్సి ఉందన్న ఆయన తనకు పిల్లలు కావాలని ఉందని మనసులో మాటను బయటపెట్టారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా గడ్డంతో కనిపించడంపైనా రాహుల్ స్పందించారు. యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం తీయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, ఇప్పుడా గడ్డాన్ని ఉంచాలా? తీసేయాలా? అన్న విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com