చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్సిసి అధికారి పసుపుల రాశేఖర్, ఫిజికల్ డైరెక్టర్ డేవిడ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్సిసి విద్యార్థులచే బుధవారం మునగ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణంలో ఎన్సిసి విద్యార్థులచే శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను తొలగించి, మునగ మొక్కలను నాటామన్నారు. మునగ మొక్కలను పెంచడం ద్వారా మునగాకు, మునగ కాయలను మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు వడ్డించినట్లయితే మంచి పోషకాలు మరియు విటమిన్లు విద్యార్థులకు లభించడం ద్వారా కంటి చూపు మెరుగవుతుందని ఆరోగ్యవంతులుగా తయారవుతారని అన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే మునగ మొక్కల పెంపకం గురించి అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు భాస్కరరావు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు దుర్గరాజు, ఆఫీస్ సబార్డినేట్ కిరణ్ కుమార్ రాజు, ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.