రాజకీయాలకు దూరంగా ఉంటూవస్తున్న ఎన్ రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులతో ఆయన కాలంసాగిదీస్తున్నారు. ఇదిలావుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా ఎన్.రఘువీరారెడ్డి పనిచేశారు. విభజన తర్వాత పరిస్థితులు మారిపోవడంతో ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ.. సొంత ఊరిలో సాధారణ జీవితం గడుపుతున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు. రఘువీరా మనవరాలితో సరదాగా గడుపుతున్నారు.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా రఘువీరారెడ్డి మరో వీడియోను పోస్ట్ చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం చెరువు దగ్గరకు షికారుకు వెళ్లారు.. చెరువులో మనవరాలితో కలసి సరదాగా తెప్పలో విహరించారు. మనవరాలితో కలసి ఆయన కూడా చిన్నపిల్లాడిలా ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాలు వదిలేసి చాలా సంతోషంగా ఉన్నారు.. ఈ వయసులో మీకు కావలసింది ఇలాంటి సంతోషం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు నీలకంఠాపురం చెరువులో నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి.
మనవరాలితో సరదాగా గడిపిన క్షణాలను వీడియో రూపంలో అందరితీ పంచుకుంటున్నారు రఘువీరా. గతంలో తాత (రఘువీరా) తనతో ఆడుకోవడం లేదని.. ఆయన్ను తాడుతో స్తంభానికి కట్టేసింది. ఈ ఫొటోను రఘువీరా పోస్ట్ చేశారు.. అలాగే మనవరాలికి నేర్పిస్తూ ఓ వీడియో తీశారు. తాను చిన్నతనంలో ఇక్కడే ఈత నేర్చుకున్నానని.. ఇప్పుడు మనవరాలికి కూడా ఈత నేర్పిస్తున్నట్లు చెప్పారు. ఆమెకు తాడు కట్టి ఈత ఎలా కొట్టాలో శిక్షణ ఇచ్చారు.
సమయం దొరికినప్పుడు ఇలా మనవరాలితో సరదాగా గడుపుతారు రఘువీరారెడ్డి. గతంలో మనవరాలితో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న రఘువీరా సాధారణ జీవితం గడుపుతున్నారు. సొంత ఊరైన నీలకంఠాపురంలో 1200 ఏళ్ల కిందటి చారిత్రక నీలకంఠేశ్వరుడి గుడి జీర్ణోద్ధరణ చేశారు.