శ్రీ సత్యసాయి జిల్లాలో మల్బరీ రైతులకు రావాల్సిన రెండు కోట్ల 10 లక్షల రూపాయలను రైతుల ఖాతాలకు వెంటనే జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సత్యసాయి జిల్లా అధ్యక్షులు అడపాల వేమ నారాయణ ప్రభుత్వాన్ని శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు కాటకాలకు నిలయమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో మల్బరీ పంటను సాగు చేసి అధిక దిగుబడులతో ప్రధాన వాణిజ్య పంటగా ఖ్యాతి గడిచిన ఈ పట్టు పంట అధికారుల నిర్లక్ష్యం పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా సాగు విస్తీర్ణం నానాటికి తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021. 22 సంవత్సరానికి గాను 90 లక్షలు. 2022. 23 కు గాను ఒక్క కోటి 20 లక్షలు జమ కావాల్సి ఉండగా ఇంతవరకు నయా పైసా రైతులకు చెల్లించలేదని అదేవిధంగా గొర్రెలు మేకలు పశువులకు రావాల్సిన 9 కోట్ల రూపాయలు పండ్ల తోటల బీమా ఏడు కోట్ల రూపాయలు మొత్తం రైతుల ఖాతాలకు జమ చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎస్ హెచ్చరిస్తుందన్నారు.