రైలు ఢీకొని, ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం విజయనగరం రైల్వేస్టేషన్ దగ్గర చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ రవివర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు విజయనగరం రైల్వేస్టేషన్ ఒకటో నంబర్. ప్లాట్ ఫామ్ కి వస్తుండగా, 30 నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తి రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించగా, ప్రమాదవశాత్తు ఆ రైలు ఢీకొని, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ నంబర్లు 9666555214, 9490617089 సంప్రదించాలని జీఆర్పీ ఎస్ఐ రవివర్మ కోరారు.