టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి దొరికిపోయిన దొంగ అని.. దొరికిపోయిన దొంగలు ప్రతిపక్షాలు, మీడియా మీద నిందలు వేస్తున్నారని విమర్శించారు. హై ప్రోఫైల్ ఉన్న కొందరు వ్యక్తులు కూడా బయటపడతారని.. సీబీఐ విచారణకు వెళ్తారని అన్నారు. వివేకానంద హత్యకు సంబంధించి సాక్ష్యాలను అవినాష్ రెడ్డి నాశనం చేశారని ఆరోపించారు. టెక్నాలజీ సహాయంతో సీబీఐ వాస్తవాలను బయటపెడుతుందని, దొరికిపోయిన దొంగలు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత చేస్తున్న పోరాటం నిందితుల మెడకు బలంగా చుట్టుకుందని బోండా ఉమ అన్నారు.