దివ్యాంగ విద్యార్థులకు (ప్రత్యేక అవసరాల పిల్లలకు) గృహ ఆధారిత విద్యా భత్యం, రవాణా భత్యం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు గృహ ఆధారిత విద్యాభత్యం కింద రూ.కోటీ 67 లక్షలు, రవాణా భత్యం కింద రూ.3.63కోట్లు, ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న దివ్యాంగ బాలికలకు ఉపకార వేతనం కింద రూ.2వేల చొప్పున రూ.3.74కోట్లు ఈ నెల 23న విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ ఎస్.సురే్‌షకుమార్ శనివారం తెలిపారు.