శ్రీకాకుళంలో 9వ ఇఫ్టూ (ఐఎ్‌ఫటీయూ) రాష్ట్ర మహాసభలు.. శనివారం ప్రారంభమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు గళమెత్తి నినదించారు. ఈ సందర్భంగా ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్ ప్రసంగిస్తూ.. దేశంలో మోదీ-షాల హయాంలో దేశం ఫాసిస్టు పాలన వైపు ప్రయాణం సాగిస్తోందని విమర్శించారు. దేశంలో ఇప్పటికి మూడు దఫాలు సంక్షోభాలను పెట్టుబడిదారీ వ్యవస్థ చవిచూసిందని.. ఇప్పుడు మరో భారీ సంక్షోభానికి గురికాబోతుందని తెలిపారు. భారీ ప్రాజెక్టుల పేరుతో ప్రజల ఆస్తులను కొల్లగట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. ఐఎ్‌ఫటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఎదురవుతున్న సవాళ్లపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.