అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి వీవర్స్ కాలనీ వద్ద సోమవరం కారు బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5 గురికి స్వల్పగాయాలయ్యాయి. విశాఖ నుండి అన్నవరం వెళ్లి తిరిగి వస్తుండగా నక్కపల్లి వద్ద ప్రమాదం చొటు చేసుకుందని పొలీసులు అంటున్నారు. గాయాలపాలైన వారిని నక్కపల్లి హైవే పెట్రోలింగ్ వాహనంలో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు.