నాగులుప్పలపాడు మండలం సోమవారం అమ్మనబ్రోలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి డా కంచర్ల శ్రీకాంత్ ని గెలిపించాలని క్లస్టర్ ఇన్చార్జి ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. క్లస్టర్ ఇన్చార్జి ఈదర వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో నలుగురు యూనిటీ ఇన్చార్జీలు మరియు నాయకులు తో ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై చర్చించారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ మరియు యూనిటీ ఇన్చార్జి వల్లేటి పాండురంగారావు , ఏడుగుండ్లవెంకటేశ్వరరావు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పాంప్లెట్లు, స్టిక్కర్స్ మరియు ఒటర్ లిస్ట్ పంపిణీ చేయడం జరిగింది.