ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం సౌందర్య తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సోమవారం తెల్లవారుజామున 1500 కేజీల బరువైన ముక్కుడు టేకు చేప లభ్యమయింది. బోటుపై సముద్ర ఒడ్డుకు మత్స్యకారులు తీసుకువచ్చారు. పెద్ద ముక్కుతో ఉన్నటువంటి ఈ టేకు చేప సముద్రంలో గనక తన రెక్కలతో కొడితే మనిషికి తీవ్ర గాయాలవుతాయని చెప్పారు. ఈ చేపను చూసేందుకు అనేకమంది వెళ్లారు. బయట మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంటుందని స్థానిక మత్స్యకార వ్యాపారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa